Home

ఆణిముత్యాలు

తేనెటీగల తుట్టె నైనా ఒక క్రమం లో పెట్టవచ్చునేమో గాని, మనస్సుల పరంపర లో కొట్టుకు పోయే వాళ్ళను దారిలో పెట్టడం చాలా కష్టం
A hive of bees can be put in order, but it is very difficult to guide those who are in a series of thoughts.

ప్రతి ఉదయం మనకో వరం. అందుకే సూర్యోదయమునకు ముందే నిద్ర లేచి, ఈ సృష్టి ఆధారాల చైతన్యలను స్వీకరిస్తూ, అనుసరిస్తూ, విశ్వసిస్తూ ఆస్వాదించండి.
Every morning is a blessing to us. So wake up before the sun rises and enjoy receiving, following and trusting the consciousnesses of these fundamentals of creation.

తూటా కంటే శక్తివంతమైనది మౌనం. మౌనం కంటే శక్తివంతమైనది త్యాగం.
Silence is more powerful than a bullet. Sacrifice is more powerful than silence

విశ్వాసానికి అసలు ఖర్చు ఉండదు. విశ్వాసం లేకపోతే చాలా కోల్పోవలసి వచ్చును. అందుకే ఎప్పుడూ విశ్వాసం తో ఉండండి.
Faith has no real cost. If you don't have faith, you may lose a lot. So always have faith

మీ బుద్ధి మీ చుట్టూ మీకు రక్షణ కవచం గా పరిరక్షిస్తూ ఉంటుంది. మీ మనస్సు మీ ముందు నడుస్తూ మిమ్ములను దుఃఖంలో ముంచేసి వెళ్ళిపోతుంది.
Your mind surrounds you as a protective shield. Your mind runs ahead of you and leaves you in sorrow

ఆధ్యాత్మిక అనుభవం అంటే బోధ తో సంతోషం కలగాలి; స్పర్శ తో ఆనందం కలగాలి; చూపుతో నియంత్రణ రావాలి; మౌనం తో పరవశించాలి; కష్టం వస్తే సేద తీర్చాలి; తప్పు చేస్తే కడుపు లో పెట్టుకుని చింతన, కన్నీళ్ల తో శుద్ధి చేసి సంస్కరించాలి.
Spiritual experience means to be happy with preaching; Happy with touch; Control with vision; Ecstatic with silence; Relaxation in case of a difficulty; If erred, stomach and purify it with tears and meditation

ఏది నిజం, ఏది అబద్దం అనేది మీ నిజ నిజాల పైన, అబద్ధాల పైన నిలబడి ఉండును; ఏది సత్యం అనేది ఇవేవి లేని మీ విశ్వాసం పై ఆధారపడి ఉంటుంది.
What is true and what is false will stand above your truths and lies; What is truth depends on your belief that none of these are true

మౌనం నుంచి సత్య బోధ వస్తుంది; మాట సత్యమును బట్టి బోధించలేదు.
From silence comes the teaching of truth; The word is not taught according to truth